#saideepbugatha

11 posts
 • saideepbugatha 7w

  జ్ఞాపకం

  తగ్గే చూపు..
  తరిగే జుట్టు..
  ఉడే పళ్ళు..
  ఊగే ఒళ్ళు..
  అరిగిన దుమ్ము..
  అలసిన దమ్ము..
  ముడతల చర్మం..
  విడతల్లో పోయే ప్రాణం..
  వీటన్నిటి మధ్యలో దొరికే జ్ఞాపకం.
  ఇది మనం.. ఇదే మనం.
  ©gnana

 • saideepbugatha 7w

  మౌనం లోతేంత ..?
  మనం ఎప్పుడూ కొలవని మహాసముద్రమంత.!
  ©gnana

 • saideepbugatha 8w

  ప్రేమ

  ప్రేమని పంచాలి రా .. ప్రేమని మాత్రమే పంచాలి.
  మనం ఏదీ ఇస్తే అదే వస్తుంది అంట గా.. అప్పుడు ప్రేమే వస్తుంది.
  పొరపాటున వెనక్కి చెడు వచ్చిన... నువ్వు ప్రేమేనే గా పంచింది.
  You did the good thing.
  ©gnana

 • saideepbugatha 8w

  మనందరిలో ఒక పెద్దోడు.. ఒక చిన్నోడు ఉంటారు.. పెద్దోడికి ఓడిపోవడం, వదిలి వెళ్ళిపోవటం, పడిపోవటం పెద్దగా బాధించావు.. వాడో బ్రతుకేరిగిన బాటసారి... కానీ మనలో చిన్నోడికి అవ్వని పట్టవు.. అందుకే ఓడిపోతే నలిగిపోతాడు, పడిపోతే ఏడుస్తాడు, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతే కన్నీరు కారుస్తాడు.
  ©Gnana

 • saideepbugatha 9w

  Conscience

  Always do the right thing.. even if no one's watching.
  Hmmm... Karma might be a bitch or might not be, as a matter of fact i don't really care...
  But deep down in the bottoms of your heart you bloody knew that it is the right thing to do.
  That my friend.. is called conscience.
  Don't ever lie to it.
  ©saideepbugatha

 • saideepbugatha 9w

  మగాళ్లం

  మెలితిప్పిన మీసాలే మా mark u..
  మా గుబురు గడ్డల రంగే dark u..
  మా మాటేమో కాస్త గరుకు..
  మనసు మాత్రం A1 సరుకు.
  మాకు ఒంట్లో లేదు ఏ బేరుకు.
  మీరు ఓనిలు వేస్తే మా గుండెలు క్రాకు.
  కంటి చూపేమో కాస్తంతా కరుకు.
  కష్టమన్నది రానివ్వం కాళ్ళ వరకు.
  పనిలో పడితే మేము చురుకు..
  పాంతానికొస్తే ఎవడినైనా తెగ నరుకు.
  కన్నుకోడితే మీకు చిరాకు.. మీ చివాట్లే మాకు తియ్యని చెరుకు
  చిరిగిన ప్యాంటు..నలిగిన షర్టు.
  చెదిరిన క్రాఫు.. చెప్పలేని కైపు
  నోట్లో వెలిగిన బీడీ.. నడిపేము మోటార్ గాడి.
  మమ్మల్ని చుసిన ఆడ లేడీ.. అంటారు వీడో కేడి.
  ©saideepbugatha

 • saideepbugatha 12w

  నా కవిత

  కేలికితే వచ్చేవా .. కోరి కొని తెచ్చేవా నా కవితలు
  కొలిమి నిప్పుల మంటల్లో… కాలిన కవి గుండెల్లో
  రగిలిన అగ్నిజ్వాలలు.!

  పాడి వినిపించేవా.. పొద్దు దినకరించేవ నా మాటలు
  పాండిత్యం లేని ప్రయత్నాలు..
  సాహిత్యం రాని ప్రయోగాలు..
  వాటి సమూహాలు !

  రక్తంపేర్చి.. చెమటను గూర్చి రాసిన రాతలు
  రెక్కలు విరిగిన.. డొక్కలు ఎండిన
  బడుగుల బ్రతుకులే వాటికి ప్రేరణలు.
  ©saideepbugatha

 • saideepbugatha 49w

  ఆస్తి

  నొప్పి నేర్పించే పాఠాలు..
  గాయం  గుర్తుచేసే  జ్ఞాపకాలు
  బాధలో అనుభవిస్తున్న క్షణాలు..
  ఓటమి లో తీసుకున్న నిర్ణయాలు..
  నువ్వు సంపాదించే డబ్బు కట్టలు కంటే చాలా విలువైనవి... నీ కట్టలు నీకు మహా ఐతే కూడు, గుడ్డ, గూడును మాత్రమే సమాకురుస్తాయి కానీ..ఇవి నిన్ను నిన్నుగా..ఒక మనిషిగా తీర్చిదిద్దుతాయి.
  ©saideepbugatha

 • saideepbugatha 56w

  మార్పు

  మనం ఎదురు చూస్తున్న మార్పు రాకపోతే ఏమి చెయ్యాలి ?
  Ans: నువ్వు మారాలి !


  ©saideepbugatha

 • saideepbugatha 79w

  రంగుల రాట్నం 

  రంగుల కొంగును చుట్టుకున్న రంగుల రాట్నం రా 
  ఇది రంగులు అద్ది హంగులు దిద్దే రంగస్థలం రా !

  కారులున్న కుబేరులంతా కర్మజీవులు రా..
  కసాయి పనులెన్నిజేసినా మన కళ్ళు మూసుకుందాం రా !

  మంత్రి ఎంత కంత్రి ఐనా మర్చిపోదాం రా 
  మనం మనం మంచి కులం అంటూ ఓట్లు గుద్దేదాం రా ! 

  "మన సొమ్ము తిననోడు లేదులే" అని తప్పుకుందాము రా 
  "మావోడు తింటే తప్పేంటి?" అని తప్పునీ తిప్పుకుందాము రా !

  తొడలు మెడలు తిప్పి చెప్పిన మనవికి 
  మీసాలు దువ్వుకుందాం రా 
  వాడి మందు విందు చిందులతో చొక్కాలు చింపుకుందాం రా !

  పెళ్ళాం మేడలో పసుపు తాడునీ తెంచేద్దాం రా 
  ప్రజానాయకుడు మేడలో పూలదండలేసేద్దాం రా !

  అంబానీ మామ నెట్ విసిరాడు రా 
  సోషల్ నెట్ లో చిక్కుకున్న చేపపిల్ల నువ్వే రా !

  పట్టా చేత పడతనని ఫోన్లు పెట్టుకుందాం రా 
  పాపను పట్టి చాట్టింగ్లు కొట్టి మంచమెక్కద్దాం రా !

  కాళమ్మతల్లి బిడ్డల్ని కడతేర్చెద్దాం రా 
  కుప్పిగంతులేసినోళ్లని కింగులు చేసేద్దాం రా !

  కాలి లొల్లి ట్రోల్ పేజీలు పెట్టుకుందాం రా 
  ట్వీట్లు ట్రెండ్లు అంటూ హీరోల కోసం కొట్టుకుచద్దాం రా కసిగా కొట్టుకుచద్దాం రా !

  మగువ మోసం చేసిందంటూ రోడ్లు ఎక్కిపోదాం రా  
  వినకపోతే ఉరి పోసుకున్న వీడియోలే తీసుకుందాం రా !

  తాజాగా వార్తల్లో నిలిచిపోదాం రా  ! 
  మనం తెల్లారే ఫ్రంట్ పేజీలో చేరిపోదాం రా !

  కన్నవాళ్ళ కలలు మొత్తం కాలరాసేద్దాం  రా 
  పేగు తెంచిన కడుపుకు కోతను పంచేద్దాం రా !

  రంగుల కొంగును చుట్టుకున్న రంగుల రాట్నం రా 
  ఇది రంగులు అద్ది హంగులు దిద్దే రంగస్థలం రా !
  ©saideepbugatha

 • saideepbugatha 164w

  కన్నీళ్లు

  ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిన నా కళ్ళు ఒక కథని చెప్తాయి..
  ఎంత ఎదురుచూసినా తిరిగిరాని నీకోసం.. నువ్వు మిగిల్చిన జ్ఞాపకాల కోసం..

  రాత్రి పడుకునేటప్పుడు నిన్ను తలచుకుంటే కళ్లలోనుంచి తలగడ మీదకు మెల్లగా జారే ఆ కన్నీళ్లు..

  అలా ఆకాశంలోకి చూస్తున్నప్పుడు.. అంతే విశాలంగా ఉండే మన ప్రేమ ఎందుకిలా చీకటి గుహలో చిక్కుకుపోయింది అని వచ్చే కన్నీళ్లు..

  గట్టిగా గుండెలు అలిసేలా అరచి నువ్వు లేవని విర్రవీగుతూ పుట్టుకొచ్చిన ఆ అంధకారపు గోడలు బద్దలకొట్టాలని వచ్చే కన్నీళ్లు..

  నీకోసం వెతికి వెతికి అల్లాడిపోతున్నప్పుడు వచ్చే కన్నీళ్లు..

  అలాంటి కన్నీళ్లు చెప్పే కథల్ని  వినేదేవరు ? నా చెంపలు తప్ప! ఓదార్చేదెవరు నా చేతివేళ్ళు తప్ప !

  ఆ కన్నీళ్లకు ఎమోచ్చు .. ఎప్పటికప్పుడు మన జ్ఞాపకాలను నెమరువేస్తూ నన్ను హింసించటం తప్ప !

  ఆ కన్నీళ్లకు ఎమోచ్చు నీ ముసిముసి నవ్వులను తలచి మురిసిపోవడంతప్ప !

  ఆ కన్నీళ్లకు ఎమోచ్చు  నీ ముద్దు ముద్దు మాటలను తలచి మైమర్చిపోవడం తప్ప !

  ఆ కన్నీళ్లకు ఎమోచ్చు నీ రూపాన్ని పదిలంగా దాచుకోవటం తప్ప!

  ఆ కన్నీళ్లకు ఎమోచ్చు.. నువ్వు లేవు అనే భయంకరమైన బాధ ని భరించడం తప్ప !

  ఎమ్మోచే తల్లి ! నాకు ఏడవడం తప్ప..

  అందనంత ఎత్తుకి ఎగిరిపోయావ్  అనంత చీకట్లోకి చేరిపోయావ్.. ఒక్కమాటైనా నాతో చెప్పలేవా?
  ఎం ?  చెప్తే ఏదోకటి చేసి నీ దరికి చేరిపోతాననా ? ఎంత స్వార్థం .. ఈ ఎడబాటుతో నీకు స్వాతంత్రం, నాకు శాపం మిగిల్చి సుఖంగా ఉన్నావు.

  కొన్ని సార్లు అంతే
  కథ ముగిసినా కనీళ్లు ఆగవు..
  ప్రయాణం ముగిసినా ప్రయాస ఆగదు..
  ప్రాణం పోయినా ప్రేమ చావదు.
  ©saideepbugatha