#telugu

1913 posts
  • vsb_heartsays 1w

    COFFEE FULL OF LOVE ❤️

    You are the First stubbornness in my heart
    Raising up like a fresh brewing coffee under the Flame of love and bliss
    Cuddling me with a beautiful aroma of warmth
    Quenching my thirst by numbing my taste in the blindness of imperishable life
    Endorsing the magical flavours of emotions and feelings
    Dripping in with a cookie of longing for eternity
    With the essence of reverence
    ©vsb_heartsays

  • words_from_heartt 5w

    Appudu appudu mana mother tongue lo express chesthy ah kick aa verappa! Raastu unte konchem baadha thaggutundi abba! #telugu #linesclosetoheart

    Read More

    Don't we deserve someone,
    Evartho aithy manam manala undagalguthamo,
    Manalni manala ardam cheskoni premistharo,
    Em santhoshalu aina, kastalu aina, baadhalu aina, achievements aina share cheskogalguthamo
    Vallaki manam unnam anna bharosa ivvagalguthamo
    Manaki vallu unnaru ani prashantham ga nidrapogalguthamo!

    Is it me asking for too much ?
    ©words_from_heartt

  • words_from_heartt 6w

    Neekosam chala chala paatalu paadali, neeku dedicate cheyyali
    Neetho chala chala kaburlu cheppali
    Ninnu navvinchali, knchm edpinchali
    Neetho aadukovali, allari cheyyali
    Inthaki nannu baristava, premistava, ardam cheskuntava?
    ©words_from_heartt

  • goddatipavani 6w

    ఓ రైతు....!

    నీకు లేదా అలుపు,
    నీ కృషికి లేదా గుర్తింపు..!
    ఎప్పుడు చూస్తామయ్య ...?
    నీ కళ్లలో ఆనందాల మెరుపు..!
    కోడి గూసే నుండి గూడు చేరేదాకా,
    ఎండలో మండిన, వానలో తడిసిన
    నా పంటతల్లి కోసమే అంటవు,
    పుడమితల్లిని నీ పంటతో పులకరింపజేసి,
    ఎండిన డొక్కతో ఏమి లేనుడువై ఉంటవు....!
    #Secretadmirer
    ©goddatipavani

  • goddatipavani 7w

    కొసరి కొసరి పెట్టిన తనచేతి బువ్వ..!
    దూరంగా ఉన్న దైర్యాన్ని కోల్పోని తన గుండె...!
    ఎడబాటు ఎంతైనా కన్నీరు ఎరుగని తన కళ్లు...!
    ఘాటుగా చెప్పిన ,తీపిగానే ఉండే తన మాట...!
    చందమామకు కూడా చిక్కని తన చిరునవ్వు...!
    ఎంతకష్టమోడిన ఒసి ఇంతేగా అనే ఒళ్లు....!
    వెన్నెలరాత్రి కంటే వెచ్ఛనైన తన ఒడి ...!
    తూకమే ఎరుగని తన త్యాగం....!!!అమ్మ❤
    #secretadmirer
    ©goddatipavani

  • goddatipavani 7w



    అదృష్టం, దరిద్రం
    తలరాత,చేతిగీత
    మన చేతకానితనానికి,
    చేయలేనిపనులకు పెట్టుకున్న
    అందమైన పేర్లు..!
    ©goddatipavani

  • jaipalwrites 8w

    మనిషి

    "మనిషి" నే మెచ్చితిని "గుణం లేని నీ గుణగణాలను"
    "మనిషి" నే మెచ్చితిని "మంచి లేని నీ మానవత్వం"
    "మనిషి" నే మెచ్చితిని " సాయం లేని నీ స్వభావం"
    "మనిషి" నే మెచ్చితిని "అడుగు తీయని నీ ఆరాటం"
    "మనిషి" నే మెచ్చితిని "విలువ లేని నీ వీక్షణం"
    "మనిషి" నే మెచ్చితిని నాడు "నేను సచ్చితి నేడు"
    ©jaipalwrites

  • saideepbugatha 8w

    జ్ఞాపకం

    తగ్గే చూపు..
    తరిగే జుట్టు..
    ఉడే పళ్ళు..
    ఊగే ఒళ్ళు..
    అరిగిన దుమ్ము..
    అలసిన దమ్ము..
    ముడతల చర్మం..
    విడతల్లో పోయే ప్రాణం..
    వీటన్నిటి మధ్యలో దొరికే జ్ఞాపకం.
    ఇది మనం.. ఇదే మనం.
    ©gnana

  • jaipalwrites 8w

    "సిరి వెన్నెల"

    అక్షరం కన్నీరు పెడుతోంది.. నీకు అస్తమయం అయిందని,
    కలం కదలనంది మీ తనువు తాకి లేవనిదే,
    పెదవి నుండి పాట రానంది.. మీ చేతి పలకరింపు లేనిది,
    కంఠ స్వరం సక్కుబడింది.. మీ స్వర్ణ గానం గగనమయి పోయిందని,
    ' సిరి వెన్నెల ' కాంతుల్లో పాటకు ప్రాణమై మళ్ళీ పలకరించు ఓ..' సిరి వెన్నెల '.

    ©jaipalwrites

  • kalakruthi 8w

    #మేలిముసుగు
    మేలి కురుల ముసుగు చాటు అందాల మోమున విరిసీ విరియని చిరునవ్వుల పువ్వుల చిందే మకరందమో!!
    కనుకొసల ప్రజ్వలిత కాంతి పరిక్షేపణా విరచిత ఇంద్రధనువును అలవోకగ విసిరిన చూపుల పదబంధమో!!
    యద సవ్వడి ఎగసిపడే సాగర కెరటమై, తొలకరి తాకిన పుడమి విడిచే నులివెచ్చని సుగంధమై, విచలిత మనసున తాపమో!!
    చెలీ! చంచలమై చెలించి చలించి పరితపించి, మౌన మేఘాల చీకటి చీల్చి, తొలి వెలుగురేకై నీ మేలిముసుగు మాటు తొలచి, కడకు చేరితినే, ప్రేమానుబంధాల ఉప్పెనై పొంగు కడలిలో!!!
    ©kalakruthi
    #Mirakee #telugu velugu #telugu

    Read More

    మేలిముసుగు

    మేలి కురుల ముసుగు చాటు అందాల మోమున విరిసీ విరియని చిరునవ్వుల పువ్వుల చిందే మకరందమో!!
    కనుకొసల ప్రజ్వలిత కాంతి పరిక్షేపణా విరచిత ఇంద్రధనువును అలవోకగ విసిరిన చూపుల పదబంధమో!!
    యద సవ్వడి ఎగసిపడే సాగర కెరటమై, తొలకరి తాకిన పుడమి విడిచే నులివెచ్చని సుగంధమై, విచలిత మనసున తాపమో!!
    చెలీ! చంచలమై చెలించి చలించి పరితపించి, మౌన మేఘాల చీకటి చీల్చి, తొలి వెలుగురేకై నీ మేలిముసుగు మాటు తొలచి, కడకు చేరితినే, ప్రేమానుబంధాల ఉప్పెనై పొంగు కడలిలో!!!
    ©kalakruthi

  • saideepbugatha 8w

    మౌనం లోతేంత ..?
    మనం ఎప్పుడూ కొలవని మహాసముద్రమంత.!
    ©gnana

  • goddatipavani 9w



    గోడు చెప్పుకోనీకే,
    గోరంతయిన సమయమిచ్ఛి..
    గోరి దాకా తోడు నిలిచే మనిషి కోసం,
    గోసరిల్లుతున్న మనసులెన్నో..?
    #secretadmirer
    ©goddatipavani

  • saideepbugatha 9w

    ప్రేమ

    ప్రేమని పంచాలి రా .. ప్రేమని మాత్రమే పంచాలి.
    మనం ఏదీ ఇస్తే అదే వస్తుంది అంట గా.. అప్పుడు ప్రేమే వస్తుంది.
    పొరపాటున వెనక్కి చెడు వచ్చిన... నువ్వు ప్రేమేనే గా పంచింది.
    You did the good thing.
    ©gnana

  • saideepbugatha 10w

    మగాళ్లం

    మెలితిప్పిన మీసాలే మా mark u..
    మా గుబురు గడ్డల రంగే dark u..
    మా మాటేమో కాస్త గరుకు..
    మనసు మాత్రం A1 సరుకు.
    మాకు ఒంట్లో లేదు ఏ బేరుకు.
    మీరు ఓనిలు వేస్తే మా గుండెలు క్రాకు.
    కంటి చూపేమో కాస్తంతా కరుకు.
    కష్టమన్నది రానివ్వం కాళ్ళ వరకు.
    పనిలో పడితే మేము చురుకు..
    పాంతానికొస్తే ఎవడినైనా తెగ నరుకు.
    కన్నుకోడితే మీకు చిరాకు.. మీ చివాట్లే మాకు తియ్యని చెరుకు
    చిరిగిన ప్యాంటు..నలిగిన షర్టు.
    చెదిరిన క్రాఫు.. చెప్పలేని కైపు
    నోట్లో వెలిగిన బీడీ.. నడిపేము మోటార్ గాడి.
    మమ్మల్ని చుసిన ఆడ లేడీ.. అంటారు వీడో కేడి.
    ©saideepbugatha

  • writtersfeelingz 10w

    Clueless recycle bin

    People move on
    So does your priorities
    Not everyone is busy
    Not everyone is idle
    Stop treating the one
    Who wait all day, all night
    Just to make sure

    You are ok

    If you say..it's waste of time...
    Let me be the recycle bin

    If I empty it....
    You are on gone forever
    ©writtersfeelingz

  • words_from_heartt 12w

    Relationship lo undakunda relationship problems techukoku ra rey!

  • kalakruthi 13w

    #చమక్కు #telugu #telugu velugu #mirakee
    నీ పెదాల తడి ఆరకముందే
    నా పెదవుల జడి ఎగసిపడిందే..!
    నా తమకపు ముడి వీడకముందే
    నీ చమకపు సడి ఉలికిపడిందే..!
    ఇరు ఆశల తాపాలు కోపాలు,
    విడి విడిగా దగ్గరై, కలివిడిగా ఆవిరై,
    ప్రణయాకాశపు మేఘాలై గర్జించి,
    ప్రేమల మకరందం చిందించి,
    అమృతమై వర్షిస్తేకానీ,
    తీరవులే పొడిబారిన పెదాల దాహాలు,
    ఆరవులే చెలరేగిన కాయాల మోహాలు..!!
    ©kalakruthi

    Read More

    చమక్కు

    నీ పెదాల తడి ఆరకముందే
    నా పెదవుల జడి ఎగసిపడిందే..!
    నా తమకపు ముడి వీడకముందే
    నీ చమకపు సడి ఉలికిపడిందే..!
    ఇరు ఆశల తాపాలు కోపాలు,
    విడి విడిగా దగ్గరై, కలివిడిగా ఆవిరై,
    ప్రణయాకాశపు మేఘాలై గర్జించి,
    ప్రేమల మకరందం చిందించి,
    అమృతమై వర్షిస్తేకానీ,
    తీరవులే పొడిబారిన పెదాల దాహాలు,
    ఆరవులే చెలరేగిన కాయాల మోహాలు..!!
    ©kalakruthi

  • saideepbugatha 13w

    నా కవిత

    కేలికితే వచ్చేవా .. కోరి కొని తెచ్చేవా నా కవితలు
    కొలిమి నిప్పుల మంటల్లో… కాలిన కవి గుండెల్లో
    రగిలిన అగ్నిజ్వాలలు.!

    పాడి వినిపించేవా.. పొద్దు దినకరించేవ నా మాటలు
    పాండిత్యం లేని ప్రయత్నాలు..
    సాహిత్యం రాని ప్రయోగాలు..
    వాటి సమూహాలు !

    రక్తంపేర్చి.. చెమటను గూర్చి రాసిన రాతలు
    రెక్కలు విరిగిన.. డొక్కలు ఎండిన
    బడుగుల బ్రతుకులే వాటికి ప్రేరణలు.
    ©saideepbugatha

  • kalakruthi 16w

    # అంతఃకరణ
    మనసుపడే వేదన మనిషికిదో శోధన।
    ప్రతిరోజు ప్రతిక్షణం జరిగే సంఘర్షణ!
    కళ్ళతో పర్యవేక్షణ మౌనంగా నిరీక్షణ।
    అనుక్షణం పరితపిస్తూ, జారే విచక్షణ!
    స్పందించని నీ మనసున నా తలపులు విడినా, వీడకున్నా..।
    నిరంతరం నా హృదయం జపిస్తోంది నీ నామోచ్చారణ!
    పశ్చాత్తాపం విడిచి పర్యవసానం మరిచి, కాలంతో పోటీపడి పరుగెడుతోంది సుద్దిలేని ఓ అంతఃకరణ।
    కాలమే కరిగి తన గర్భాననే కలిసినా,
    యద శిలాలిఖితమై, ఎన్నటికి నిను మరువనంటూ, ‘షిద్దత్’ సే ఇస్తోందీ వివరణ!
    మనసుపడే వేదన మనిషికిదో శోధన।
    ప్రతిరోజు ప్రతిక్షణం జరిగే సంఘర్షణ…!!
    ©kalakruthi
    #mirakee #telugu #teluguvelugu

    Read More

    అంతఃకరణ

    మనసుపడే వేదన మనిషికిదో శోధన।
    ప్రతిరోజు ప్రతిక్షణం జరిగే సంఘర్షణ!
    కళ్ళతో పర్యవేక్షణ మౌనంగా నిరీక్షణ।
    అనుక్షణం పరితపిస్తూ, జారే విచక్షణ!
    స్పందించని నీ మనసున నా తలపులు విడినా, వీడకున్నా..।
    నిరంతరం నా హృదయం జపిస్తోంది నీ నామోచ్చారణ!
    పశ్చాత్తాపం విడిచి పర్యవసానం మరిచి, కాలంతో పోటీపడి పరుగెడుతోంది సుద్దిలేని ఓ అంతఃకరణ।
    కాలమే కరిగి తన గర్భాననే కలిసినా, యద శిలాలిఖితమై, ఎన్నటికి నిను మరువనంటూ, ‘షిద్దత్’ సే ఇస్తోందీ వివరణ..!!
    మనసుపడే వేదన మనిషికిదో శోధన।
    ప్రతిరోజు ప్రతిక్షణం జరిగే సంఘర్షణ!!!
    ©kalakruthi

  • kalakruthi 19w

    #మబ్బు
    ఎన్నెన్నో సార్లు కన్నా…
    ఎలుగెత్తి అరిచా గుండెలవిసేలా !
    గళమెత్తి పాడా కంఠమెండేలా !
    కన్నీరు కార్చా కళ్ళు మండేలా !
    మనసంతా కాల్చా ఒళ్ళు ఒరిగేలా !! ఐనా…!
    కలలోను కనపడకున్నావు !
    ఇలలోను వినపడనన్నావు !
    జగమంతా నేనేనంటూనే !
    సడిసెయ్యని ‘మబ్బల్లే’ మారావు !!
    కనికరమే మరచి ఉలుకు పలుకు కరువై, కన్నా…!
    కళ్ళు మూసుకుని, కూడుతు వీడుతు కులికే నీకు…!
    ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కరిగేకాలం చాటున వెతికే నాకు…!
    తెలిసెనులే, “కుత్సితమైనది నీ బుద్ధి, బహు కచ్చితమైనది నా సుద్ది”!!©kalakruthi
    #telugu #teluguvelugu #mirakee

    Read More

    మబ్బు

    ఎన్నెన్నో సార్లు కన్నా…ఎలుగెత్తి అరిచా గుండెలవిసేలా !
    గళమెత్తి పాడా కంఠమెండేలా !
    కన్నీరు కార్చా కళ్ళు మండేలా !
    మనసంతా కాల్చా ఒళ్ళు ఒరిగేలా !! ఐనా…!
    కలలోను కనపడకున్నావు !
    ఇలలోను వినపడనన్నావు !
    జగమంతా నేనేనంటూనే !
    సడిసెయ్యని ‘మబ్బల్లే’ మారావు !!
    కనికరమే మరచి ఉలుకు పలుకు కరువై, కన్నా…!
    కళ్ళు మూసుకుని, కూడుతు వీడుతు కులికే నీకు…!
    ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కరిగేకాలం చాటున వెతికే నాకు…!
    తెలిసెనులే, “కుత్సితమైనది నీ బుద్ధి, బహు కచ్చితమైనది నా సుద్ది”!!©kalakruthi