#teluguwriter

21 posts
 • saideepbugatha 7w

  జ్ఞాపకం

  తగ్గే చూపు..
  తరిగే జుట్టు..
  ఉడే పళ్ళు..
  ఊగే ఒళ్ళు..
  అరిగిన దుమ్ము..
  అలసిన దమ్ము..
  ముడతల చర్మం..
  విడతల్లో పోయే ప్రాణం..
  వీటన్నిటి మధ్యలో దొరికే జ్ఞాపకం.
  ఇది మనం.. ఇదే మనం.
  ©gnana

 • saideepbugatha 7w

  మౌనం లోతేంత ..?
  మనం ఎప్పుడూ కొలవని మహాసముద్రమంత.!
  ©gnana

 • saideepbugatha 8w

  ప్రేమ

  ప్రేమని పంచాలి రా .. ప్రేమని మాత్రమే పంచాలి.
  మనం ఏదీ ఇస్తే అదే వస్తుంది అంట గా.. అప్పుడు ప్రేమే వస్తుంది.
  పొరపాటున వెనక్కి చెడు వచ్చిన... నువ్వు ప్రేమేనే గా పంచింది.
  You did the good thing.
  ©gnana

 • saideepbugatha 8w

  మనందరిలో ఒక పెద్దోడు.. ఒక చిన్నోడు ఉంటారు.. పెద్దోడికి ఓడిపోవడం, వదిలి వెళ్ళిపోవటం, పడిపోవటం పెద్దగా బాధించావు.. వాడో బ్రతుకేరిగిన బాటసారి... కానీ మనలో చిన్నోడికి అవ్వని పట్టవు.. అందుకే ఓడిపోతే నలిగిపోతాడు, పడిపోతే ఏడుస్తాడు, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతే కన్నీరు కారుస్తాడు.
  ©Gnana

 • saideepbugatha 9w

  Conscience

  Always do the right thing.. even if no one's watching.
  Hmmm... Karma might be a bitch or might not be, as a matter of fact i don't really care...
  But deep down in the bottoms of your heart you bloody knew that it is the right thing to do.
  That my friend.. is called conscience.
  Don't ever lie to it.
  ©saideepbugatha

 • jaipalwrites 28w

  కవిత్వం

  కవిత్వం కనుమరుగైంది అనుకున్న కానీ, కారు మబ్బుల చాటున కమ్మని కావ్యంల గర్జీస్తుంది

  దివి నుంచి భువికి జాలువారుతున్న వర్షపు బిందువులో సన్నాయి స్వరాన్ని వినిపిస్తుంది

  నా కవిత్వం సోగసులో పడి పులకరిస్తున్న
  ప్రకృతిని చూసన్న మెల్కోమంటుంది నన్ను!
  ©naataki

 • bhavanichandapuram 30w

  తులసిరామ

  రామ
  నాలోని కాంక్షకు శ్వాస నువ్వు
  నాలోని ప్రేమకు ప్రేరణ నువ్వు
  తులసి
  నా కష్టాల కన్నీటి గాధ నువ్వు
  నా సుఖాల పన్నీటి పరువళ్ళు నువ్వు
  నా అణువు అణువు నువ్వు
  తులసిరామ
  ఎందాక వేచి చూడను నీ దర్శనం కొరకు
  కలలో సాగిపోవాల సహనంతో ఉండిపోవాల
  హే నారాయణ కృప చూపవయ్య వేదన వినవయ్య
  ©bhavanichandapuram

 • dinakarreddy 44w

  పొగుడుకున్నా

  పొగుడుకున్నా నిన్ను
  అబద్ధం చెప్పుకున్నా నాకు నేను.

  ©dinakarreddy

 • saideepbugatha 50w

  #సైదీపబుగాత్తరైటింగ్స్ #teluguwriter #teluguwritings #kavitha

  Read More

  భైరాగి

  బ్రోచేవరే లేరాయే రా .. భైరాగి 
  నిన్ను బ్రోచేవారే లేరాయే రా. 

  ఊరు చివర కొండనేంచి..
  అందులోన స్వామీనుంచి
  భక్తి లోన తలపూ నుంచి 
  భుక్తి నివ్వక తనువు తృంచి 

  ఉదరం ఊగిసలాడింది రా 
  భైరాగి.. బూడిదే నెత్తిన బొట్టాయే రా ! 

  కలుపుకోలు చుట్టారికము
  కల్పితమని తెలిసిపోయే 
  కష్టమొచ్చిన కాల రాత్రినా
  కన్న వారు నిన్ను వీడిపోయే.

  బంధాలే… బారువాయే రా
  భైరాగి.. బ్రోచేవారే కరువాయే రా!


  నెత్తినేమో సిగను పెంచి 
  యాగనోపావీతం వంటికి ఉంచి
  గొంతు చించుకు గోత్రణామం
  గర్భగుడిలో నీ ప్రయాణం

  బ్రతుకే.. ప్రశ్నయింది రా 
  భైరాగి…దీపం వెలవేళబోయే రా ! 

  మారిపోయే మనసులిక్కడ 
  మాయదారి మనుషులిక్కడ
  కారుమబ్బులేమో మంచి గుణంబులు
  గాలి వానకు చేదిరిపోయే..!  

  మనిషే.. మహిషసురుడు రా
  భైరాగి.. మనసే మాయలేడి రా!

  బిచ్చమెత్తుకు తిరగనేలా?  
  భోగభాగ్యములు అనుభవించునేలా? 
  బ్రతుకు నిత్యం బాగు సేయు
  భావంబు బాగుండు సాలు

  బ్రోచేవారెవరు అక్కర్లేదు రా ! 
  భైరాగి.. బ్రోచేవారు అక్కర్లేదు రా!
  ©saideepbugatha

 • saideepbugatha 81w

  ప్రయాణం

  ఏమి అంధకారమో అంతులేని దూరమో 
  నీ ప్రయాణం.
  తోడు ఎవరు లేరు లే నీ నీడ కూడా రాదు లే 
  ఈ తరుణం.
  ఏమి వీరత్వమో విజయమెరిగిన తత్వమో 
  నీ జీవనం.
  మొద్దు ఒక్కడే పోడు లే మగధీరుడు తోడు వచ్చు లే ఆ ప్రాంగణం.
  ఏమి నేర్చుకుందువో నేర్చలేక నిరాశ పడుదువో 
  నీకున్న సమయం.
  సాక్షి మనస్సాక్షి లే దానికి శిక్షలేమి లేవు లే 
  నీ పయనం. 
  ఏమి కార్యము సేతువో కర్మలు ప్రొగెద్దువో 
  నీ సంచారం
  వేలకట్టలేని సిరిలు మొల కట్టి మోసుకెళ్ళిపో లేవు లే 
  నీ గమ్యం.
  క్షణము క్షణము రణము లే క్షణ తీరిక లేని తలుపు లే నీ స్వప్నం.
  అలుపు లేని మలుపూ లే
  అంతు లేని పరుగు లే
  దాని సాకారం.
  ©saideepbugatha

 • shekarleader 84w

  Life Lessons

  Some People come in your life and you don't actually feel that that they are important.

  You make great memories with them great bonding with them .

  Time comes they have to leave and you let them go with no care .

  Remember now you will realise they are important and you need them .

  Time and destiny tried a lot but it you who ruined it .

  "Its so easy to let them go but its to much pain later"

 • shekarleader 84w

  jivitham

  నా జీవితం లో అన్ని నాకు నచ్చినట్టు ఉండాలి అనుకుంట , కానీ నా జీవితం నాకో గుణపాఠం నేర్పింది . నా జీవితం లో ఒక వ్యక్తి నాకు పరిచయం అయి ఉన్నపుడు వాళ్ల విలువ నాకు తెలియదు , కానీ వాళ్ల విలువా తెలిసి నాకు వాలు కావాలి అన్నపుడు వాళ్ళు నాతో ఉండరు.

 • saideepbugatha 103w

  పువ్వు

  నలిగే పువ్వు అంటించు సుగంధం..నలిపే పాదాలకెంత అదృష్టం.

  పరమేశ్వరుని పాదాల చెంత చేరి పూజలందుకునందుకా మీ కిలకిలలు.
  ఆ పరమేశ్వరుని చేరుకున్న పురుషుని పాడెనలంకరించి పైన జల్ల బడుతునందుకా మీ విలవిలలు.

  చిల్లర దక్షిణా కోసం పూజారి పళ్లెంలో జారిపడ్డ మంత్రపుష్పాలుగా మీ వేషం.
  ఆ చిల్లర కోసం గుడిమెట్ల వద్ద చెమటను చిందిస్తున్న చిన్నోడి మేడలో కష్టాల పాశం.

  వయ్యారి వాలు జడను అల్లుకున్న మల్లి.. చేసావు పాపం మా మల్లిగాడి గుండెల్లో లొల్లి.
  వాసనతో మనసుని మత్తెక్కించి నువ్వు గిల్లి.. పడేసావు నీ ప్రేమలో మల్లిగాడిని మళ్ళీ మళ్ళీ.
  ©saideepbugatha

 • poornimagowda 104w

  మన దగ్గర ఉన్నదానితో మనం సంతోషంగా ఉండాలి

  © Poornima Gowda

 • saideepbugatha 112w

  ఆటగాడు

  అందమైన ఆశలు మావంటావు.. అవకాశాలే వాటికి లేవంటావు!
  అదృష్టపు నిచ్చెన లే ఎక్కిస్తావు.. ఆపైన దురదష్టపు పామువై మింగేస్తావు! 

  కోరుకున్న జీవితం కాదంటావు.. కైమొడ్చిన చేతులే మావంటావు!
  కష్టాల కుండపోతను కురిపిస్తావు.. ఒరేయ్ కన్నీళ్ళ కరువులోని కాల్చేస్తావు!

  మది నిండా మాటలతో నింపెస్తావు.. మనసునేమో మూగదాన్ని చేసేస్తావు! 
  మణిపూస లాంటి బ్రతుకు కలలు రప్పిస్తావు.. మరుక్షణమే మా బ్రతుకులు పూసగుచ్చి చూపిస్తావు! 

  ఓరిని మెటైన ఆటగాడివే .. మెలికెట్టి తిప్పేసే మోసగాడివే !

  ఏనుగంటే ఎగేస్కొని ఓచేస్తావు..దానికి ముంతలోని మోక్షాన్ని పంచేస్తావు! 
  మా ఎక్కేకి ఏడుపులు ఏరుకంటావు.. మానవ జన్మే కర్మంటావు!

  నీ శిఖరానికి మొక్కులిమ్మంటావు.. నటకకి సిరిగిన సెప్పులైన ఇయ్యకుంటావు!
  శరణగోష సేవలెన్నో అందుకుంటావు.. సామి!  సేవకునికి సావే శరణు అంటవు ! అంతకు మించిన ముక్తి లేదంటావు!

  అరిటాకంత ఆకల్ని పుట్టిస్తావు .. అరచెయ్యంత అన్నం ఇప్పిస్తావు !
  అదైనా కళ్ళకద్దుకుని తిందామంటే.. కొత్త కథను తెచ్చిపెట్టి ఎంగిలి పట్టనివ్వంతే! 

  పండగొస్తే పరమాన్నాలు పెట్టించుకుంటావు.. సామీ! నీ పేరును తలచిన పొలమారకుంటావు.
  పూలమాల పూజాలెన్నో అందుకుంటావు.. దండ కుట్టినోడి బ్రతుకు దండగ అంటావు.

  ప్రార్ధనలకి పలుకుతానంటావు.. కట్టెకాలిపోయినాక కనపడకుంటావు.. కంటపడకుంటావు.
  పుణ్యముజేస్తే స్వర్గ ప్రాప్తంటావు .. భూమిలో నరకం జూపిస్తావు.

  ఓరిని ధీటైన ఆటగాడివే.. కనికట్టులెన్నో చూపే కేటుగాడివే !
  సామి!  శతకోటి పేర్లు ఉన్న గొప్పలోడివే! 
  ©saideepbugatha

 • shhraavanwrites 122w

  జ్ఞాపకం

  నువ్వు జీవితాంతం గుర్తు పెట్టుకునే మరపురాని జ్ఞాపకం అవుతావు అనుకున్న కానీ జీవితంలో మిగిలిన చివరి రోజుల్లో కూడా మరిచి పోవాల్సిన చేదు జ్ఞాపకం అవుతావ్ అనుకోలేదు
  ©shhraavanwrites

 • shhraavanwrites 122w

  జ్ఞాపకాలు

  ఈ క్షణం ఈ నిమిషం మనం కలిసి ఉన్న తరుణంలోనే మంచి జ్ఞాపకాలని సృష్టించుకోవడం మంచిది ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు నేను కలవాలని అనుకున్న కలవ లేము మంచి జ్ఞాపకాలని సృష్టించుకోవాలి అని అనుకున్నా సమయం ఉండదు రాదు కూడా ఎందుకంటే అదే జీవిత సత్యం
  ©shhraavanwrites

 • simple_thoughts_of_latha 150w

  నీ నవ్వుని ఎక్కడైనా చూపించగలవు,
  కానీ నీ కోపాన్ని నా దగ్గర మాత్రమే చూపించగలవు ,
  నీ ఓపిక నాకు నచ్చింది !!

  నీ మాటలు ఎవరితోనైన పంచుకోగలవు,
  కానీ నీ ఆలోచనల్ని నా దగ్గర మాత్రమే చెప్పుకుంటావు,
  నీ స్వతంత్రం నన్ను మెచ్చింది!!
  ©లత

 • simple_thoughts_of_latha 151w

  ఒంటరి వేదన-2

  స్వప్నలు ,సత్యాలు చూపించావు,
  సత్యాలు స్వప్నాలుగా మిగిలాయి,
  సత్య శోధనకు దరిచూపగలవా?

  జ్ఞాపకలు,గతాలు మోయమన్నావు,
  తీయని అనుభూతులు తుడిచెయ్యల?
  మాయని మరకలు చేరిపెయ్యాల?

  బంధాలు,బాధ్యతలు అందించావు,
  భారం కాదు బ్రతుకు ఇది అని దిద్దుకొన?
  భవిష్య రాతకు సశక్తిని ఉపయోగించుకోన?
  ©simple_thoughts_of_latha

 • saideepbugatha 164w

  చెట్టు ~ పుల్ల

  అదో దిక్కులు తెలియని దట్టమైన అడవి. ఆ మహారణ్యానికి సైతం వణుకు పుట్టించే శీతాకాలం అది .. అంతలోనే ఎర్రగా ఉన్న ఆకాశం చల్లబడింది.. అప్పుడే అడవిలో సాయంత్రం కావొస్తోందేమో భగభగా మండిన భానుడు కూడా ఎర్రని బరువెక్కిన బంతిలా మారి పడమర దిక్కున పడుకున్నాడు .. వేకువజామునే లేచి వేటకు వెళ్లిన పక్షులు విశ్రాంతి కోసం వాటి గూటికి చేరుతున్నాయి. మెల్లగా ఆ ఆడివంతా వణుకు పుట్టించే చలి ఆ చలితో పాటుగా చిమ్మచీకటి అలుముకుంటోంది.
  ©saideepbugatha