#teluguwriting

33 posts
 • saideepbugatha 8w

  జ్ఞాపకం

  తగ్గే చూపు..
  తరిగే జుట్టు..
  ఉడే పళ్ళు..
  ఊగే ఒళ్ళు..
  అరిగిన దుమ్ము..
  అలసిన దమ్ము..
  ముడతల చర్మం..
  విడతల్లో పోయే ప్రాణం..
  వీటన్నిటి మధ్యలో దొరికే జ్ఞాపకం.
  ఇది మనం.. ఇదే మనం.
  ©gnana

 • saideepbugatha 8w

  మౌనం లోతేంత ..?
  మనం ఎప్పుడూ కొలవని మహాసముద్రమంత.!
  ©gnana

 • saideepbugatha 9w

  ప్రేమ

  ప్రేమని పంచాలి రా .. ప్రేమని మాత్రమే పంచాలి.
  మనం ఏదీ ఇస్తే అదే వస్తుంది అంట గా.. అప్పుడు ప్రేమే వస్తుంది.
  పొరపాటున వెనక్కి చెడు వచ్చిన... నువ్వు ప్రేమేనే గా పంచింది.
  You did the good thing.
  ©gnana

 • saideepbugatha 10w

  మగాళ్లం

  మెలితిప్పిన మీసాలే మా mark u..
  మా గుబురు గడ్డల రంగే dark u..
  మా మాటేమో కాస్త గరుకు..
  మనసు మాత్రం A1 సరుకు.
  మాకు ఒంట్లో లేదు ఏ బేరుకు.
  మీరు ఓనిలు వేస్తే మా గుండెలు క్రాకు.
  కంటి చూపేమో కాస్తంతా కరుకు.
  కష్టమన్నది రానివ్వం కాళ్ళ వరకు.
  పనిలో పడితే మేము చురుకు..
  పాంతానికొస్తే ఎవడినైనా తెగ నరుకు.
  కన్నుకోడితే మీకు చిరాకు.. మీ చివాట్లే మాకు తియ్యని చెరుకు
  చిరిగిన ప్యాంటు..నలిగిన షర్టు.
  చెదిరిన క్రాఫు.. చెప్పలేని కైపు
  నోట్లో వెలిగిన బీడీ.. నడిపేము మోటార్ గాడి.
  మమ్మల్ని చుసిన ఆడ లేడీ.. అంటారు వీడో కేడి.
  ©saideepbugatha

 • saideepbugatha 35w

  కరోనా కథలు

  మరణ భయం వెంటాడే..
  మనిషి బ్రతుకు వేలాడే..
  మూతికున్న అడ్డు తీస్తే..
  ముగిసిపోయే కథలయే.

  కూడు పెట్టని కులములాయే..
  మాత్ర వెయ్యని మతములాయే..
  కూలిపోయిన మాసిపోయిన..
  మనిషి భావలే మిగిలాయే.

  గుంత తవ్వాలేదాయె..
  గింజ నాట లేదాయె..
  గొంతులోని శ్వాస కొరకు..
  గొట్టాలు పట్టుకు వేలాడే 

  సూది మందు సదువులాయే..
  సాయం చెయ్యా కరువాయే..
  మందులిచ్చే ముసుగులోన..
  సేవల మీద చిల్లర ఏరాయే.    
  ©saideepbugatha

 • saideepbugatha 38w

  అమ్మ

  పిచ్చి తల్లి.. నా కడుపు నిండితే చాలు అనుకుంది.. తనకి ఆకలేస్తుంది అని మార్చేపోయింది.
  10 వడియాలుంటే మా ముగ్గురికి సర్ది తాను మజ్జిగ అన్నం తింటుంది.
  నాకు దెబ్బ తగిలితే తాను తల్లడిల్లింది..
  బాగైపోవాలి అని మొక్కులు మొక్కింది.

  బాధ్యతను బుజాల పై మోస్తుంది
  బాధను కడుపులో దాస్తుంది
  భారం అనిపిస్తే కన్నీళ్లు కారుస్తుంది.

  కన్న కలలను కడతేర్చింది
  కన్న బిడ్డలను ఒడి చేర్చుకుంది
  కట్టుకున్నావాడే తన లోకమనుకుంది.

  చల్లగా నవ్వుతుంది
  చక్కగా వండిపెడుతుంది
  చిరాకు తెప్పిస్తే చీపురు తిరగేస్తుంది.
  ఏంటో.. నిరంతరం ఈ ఇంటి కోసం యంత్రంలా శ్రమించే నా బంగారు తల్లి కోసం ఎంత చెప్పిన తక్కువే.
  ©saideepbugatha

 • saideepbugatha 38w

  ఎదిరించి పోరాడేవాడే కాదు.. అప్పుడప్పుడు
  ఎక్కి ఎక్కి ఏడ్చే వాడు కూడా మగాడే.


  ©saideepbugatha

 • saideepbugatha 48w

  సోదరా

  ఏ దారి లేదురా సోదరా
  నాకు ఎడారే ఎదురైంది రా !
  కన్నీళ్లు మండి ఆవిరిలా ఎగసే రా
  కానీ గుండెలో బాధ తిరలేదు రా!
  ఆరాటంతో ఉరకలు పెట్టాను రా
  కానీ అలసట నన్ను కట్టేసింది రా!
  మోపిన అడుగులో ముల్లెనో గుచ్చే రా
  దాని తీసి పెట్టె చెల్లెలు ఏడ కనపడలేదు రా!
  కటిక చీకటి కారు మబ్బులా కమ్ముకొచ్చే రా
  కానీ అమ్మ చెప్పిన చందమామ కనపడలేదు రా!
  చుక్కలన్నీ దారి చూపుతాయి అన్నావు రా
  లెక్కలేని చుక్కలేన్నో నమ్మమాన్నాయి రా!
  కోసమేరుపు ఆశ గుండెను కోరుకుతోంది రా
  కడసారిగా ఓపికను కూడబెట్టమంది రా!
  కసితీరా ఒ సారి కదలి పోతానురా
  ఎడారి కూడా ఓ దారి చూపునేమో రా!
  ©saideepbugatha

 • saideepbugatha 50w

  ఆస్తి

  నొప్పి నేర్పించే పాఠాలు..
  గాయం  గుర్తుచేసే  జ్ఞాపకాలు
  బాధలో అనుభవిస్తున్న క్షణాలు..
  ఓటమి లో తీసుకున్న నిర్ణయాలు..
  నువ్వు సంపాదించే డబ్బు కట్టలు కంటే చాలా విలువైనవి... నీ కట్టలు నీకు మహా ఐతే కూడు, గుడ్డ, గూడును మాత్రమే సమాకురుస్తాయి కానీ..ఇవి నిన్ను నిన్నుగా..ఒక మనిషిగా తీర్చిదిద్దుతాయి.
  ©saideepbugatha

 • shekarleader 67w

  చినుకు

  మేఘము నుండి ఉనపాటుగా వస్తుంది

  నీతో ఉన్నవి అన్ని హతట్టుగా టెస్కెళ్తుంది

  నీ నోటి దాహం ఆయన నీ మృతుయువు రూపాంతరం చెందుతుంది
  ©shekarleader

 • saideepbugatha 81w

  బాగా దైర్యం నటించి నటించి.. కొన్ని కొన్ని సార్లు మనసు కూడా అలసిపోతుంది రా !
  అందుకేనేమో కన్నీళ్లు కారుతున్నాయి అని కళ్ళకు కూడా తెలియదు పాపం.

  ©saideepbugatha

 • saideepbugatha 93w

  సంసారం

  అయన నెల జీతం 6000
  రోజుకి ఖర్చు 40
  రాత్రి ఇంటికి చేరటానికి ఆటోకు 10
  చేసిన కష్టం మరువటానికి ఒక పెగ్ 20
  దారిలో పెళ్ళాం కోసం కొన్న పకోడీ లేదా జిలేబికు 10
  మిగతావి ఇంటి ఇల్లాలు సర్దుకుంటుంది.

  ఇంటికి చేరుకొని, సర్కార్ ఇచ్చిన రేషన్ బియ్యం వగైరా సరుకులుతో వండుకుని, కలిసి బోంచేసి.. తీరికగా కబుర్లు చెప్పుకుంటూ.. తియ్యని సరసం ఆడుకుంటూ.. నులక మంచంలో.. నలత లేకుండా హాయిగా కునుకు తీశారు.

  ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు ఏమో మనకీ ఆనందంగా బ్రతకటానికి.
  ©saideepbugatha

 • saideepbugatha 104w

  పువ్వు

  నలిగే పువ్వు అంటించు సుగంధం..నలిపే పాదాలకెంత అదృష్టం.

  పరమేశ్వరుని పాదాల చెంత చేరి పూజలందుకునందుకా మీ కిలకిలలు.
  ఆ పరమేశ్వరుని చేరుకున్న పురుషుని పాడెనలంకరించి పైన జల్ల బడుతునందుకా మీ విలవిలలు.

  చిల్లర దక్షిణా కోసం పూజారి పళ్లెంలో జారిపడ్డ మంత్రపుష్పాలుగా మీ వేషం.
  ఆ చిల్లర కోసం గుడిమెట్ల వద్ద చెమటను చిందిస్తున్న చిన్నోడి మేడలో కష్టాల పాశం.

  వయ్యారి వాలు జడను అల్లుకున్న మల్లి.. చేసావు పాపం మా మల్లిగాడి గుండెల్లో లొల్లి.
  వాసనతో మనసుని మత్తెక్కించి నువ్వు గిల్లి.. పడేసావు నీ ప్రేమలో మల్లిగాడిని మళ్ళీ మళ్ళీ.
  ©saideepbugatha

 • saideepbugatha 112w

  కలలు కష్టాలు డబ్బులున్నవాడికి లేనివాడికి common.

  కానీ వాటిని సాధించుకోవడానికి courage, అంత common గా అందరి దగ్గర కనిపించదు.
  ©saideepbugatha

 • saideepbugatha 113w

  ఆటగాడు

  అందమైన ఆశలు మావంటావు.. అవకాశాలే వాటికి లేవంటావు!
  అదృష్టపు నిచ్చెన లే ఎక్కిస్తావు.. ఆపైన దురదష్టపు పామువై మింగేస్తావు! 

  కోరుకున్న జీవితం కాదంటావు.. కైమొడ్చిన చేతులే మావంటావు!
  కష్టాల కుండపోతను కురిపిస్తావు.. ఒరేయ్ కన్నీళ్ళ కరువులోని కాల్చేస్తావు!

  మది నిండా మాటలతో నింపెస్తావు.. మనసునేమో మూగదాన్ని చేసేస్తావు! 
  మణిపూస లాంటి బ్రతుకు కలలు రప్పిస్తావు.. మరుక్షణమే మా బ్రతుకులు పూసగుచ్చి చూపిస్తావు! 

  ఓరిని మెటైన ఆటగాడివే .. మెలికెట్టి తిప్పేసే మోసగాడివే !

  ఏనుగంటే ఎగేస్కొని ఓచేస్తావు..దానికి ముంతలోని మోక్షాన్ని పంచేస్తావు! 
  మా ఎక్కేకి ఏడుపులు ఏరుకంటావు.. మానవ జన్మే కర్మంటావు!

  నీ శిఖరానికి మొక్కులిమ్మంటావు.. నటకకి సిరిగిన సెప్పులైన ఇయ్యకుంటావు!
  శరణగోష సేవలెన్నో అందుకుంటావు.. సామి!  సేవకునికి సావే శరణు అంటవు ! అంతకు మించిన ముక్తి లేదంటావు!

  అరిటాకంత ఆకల్ని పుట్టిస్తావు .. అరచెయ్యంత అన్నం ఇప్పిస్తావు !
  అదైనా కళ్ళకద్దుకుని తిందామంటే.. కొత్త కథను తెచ్చిపెట్టి ఎంగిలి పట్టనివ్వంతే! 

  పండగొస్తే పరమాన్నాలు పెట్టించుకుంటావు.. సామీ! నీ పేరును తలచిన పొలమారకుంటావు.
  పూలమాల పూజాలెన్నో అందుకుంటావు.. దండ కుట్టినోడి బ్రతుకు దండగ అంటావు.

  ప్రార్ధనలకి పలుకుతానంటావు.. కట్టెకాలిపోయినాక కనపడకుంటావు.. కంటపడకుంటావు.
  పుణ్యముజేస్తే స్వర్గ ప్రాప్తంటావు .. భూమిలో నరకం జూపిస్తావు.

  ఓరిని ధీటైన ఆటగాడివే.. కనికట్టులెన్నో చూపే కేటుగాడివే !
  సామి!  శతకోటి పేర్లు ఉన్న గొప్పలోడివే! 
  ©saideepbugatha

 • saideepbugatha 114w

  చిద్విలాసం

  జీవితంలో కష్టాలు రావటం వేరు.

  జీవితమే ఒక కష్టం అవ్వటం వేరు.

  కొన్ని వాటిని దైర్యం గా ఎదిరిస్తం..

  కొన్నింటిని ఎదిరించడానికి దైర్యన్ని కూడేస్కుంటం..

  జీవితానికి జాలి దయ లాంటివేమీ ఉండవు కదా! మరికొన్ని కురిపిస్తుంది.. దారి అంతా గాఢాంధకారం అలుముకుంటుంది. దైర్యం సన్నగిల్లి..మనసును మెల్లగా మౌనం ఆవహిస్తుంది.

  మనుషులేం కర్మ ! అంతా చీకటిని నీ సొంత నీడ కూడా భరించలేక బెదిరి పారిపోతుంది.. కనుమరుగైపోతుంది.

  ఎవరు వదిలేసినా ..నీతో వుండేది నిశ్చలమైన నీ చిరుమందహసం.. దాని చిద్విలాసానికి చిన్నబోతుంది చీకటి సైతం.

  కష్టాలు కన్నీళ్ళను తోడు తెచ్చుకున్నటే మరి వాటిని పోరాడానికీ నువ్వు నీ నవ్వుని తోడు తీసుకెళ్లాలి గా !
  ©saideepbugatha

 • kanakamrcricket 118w

  తిరిగి తిరిగి అలసిన ధరణి భ్రమణం ఆపేసినా,
  వీచి వీచి వేసారిన వాయువు వేగం పెంచేసినా,
  ఎల్లకాలం ఏం సాగనని, సకాలంలో కాలం మొండికేసినా,
  గడియ గడియ ఆడిన గుండె ఒక్కసారి గమనం నిలిపేసినా,

  ఉనికేది.. మనికేది మనకు,
  ఉలుకుపలుకైన రావులే మనుజులకు.

  ©Kanaka

 • blueleaf 129w

  చినుకు పడే చప్పుడులో
  ఎన్ని కన్నీటి చుక్కలు శ్వాస తీసుకుంటాయో..
  ఎన్ని గుండెలు బాధ తీర్చుకుంటాయో..

  ©blueleaf

 • blueleaf 129w

  చరిత్రను పనిగట్టుకుని సృష్టించలేము
  తీక్షణమైన పట్టుదలే చరిత్ర అవుతుంది

  ©blueleaf

 • blueleaf 129w

  మలుపు మలుపుకూ దొరికితే అది గెలుపెలా అవుతుంది..
  అలుపెరగక పరిగెత్తి చూడు అందలం దొరుకుతుంది..

  ©blueleaf